Translate

Thursday, 5 May 2016

పిల్లలూ ....చదువులు ……

సాధారణంగా తమ పిల్లలు విద్యారంగంలో సాఫల్యత పొందాలని ప్రతి తల్లిదండ్రులు కోరుతుంటారు . కానీ కొంతమంది పిల్లలో ఆ తపన, ఆసక్తి ఉండకపోవడం, వారి తల్లిదండ్రులకు బాదాకరం . మరి కొంత మంది పిల్లలో తపన ఉన్న, అన్య కారణాల వల్ల సాఫల్యత  పొందలేక పోతారు .
చక్కగా చదువుకునే అలవాటు సహజంగా అందరిలో ఉండదు . కొంతమంది పిల్లలకు అది నేర్పల్సివస్తుంది . చదువుకోవడానికి తగిన సమయము  ఏర్పాటు చేసుకుంటూ , కావాల్సిన సార్ధకమైన పద్దతులు నేర్చుకోవడం వల్ల చదువుకునే పిల్లలో ఉండే మానసిక ఒత్తిడి తగ్గుతుంది .

రండి! మరి , పిల్లలు తమ చదువుకి తగిన సమయం కేటాయించు కుంటూ , నైపుణ్యంతో  చదవడానికి ఉపయోగపడే ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం .

  1. పిల్లల వయసుకి సరిపడే కృషి చేయించడం : చదవడం అనేది కృషి తో కూడిన పని . పెద్ద పిల్లలతో పోలిస్తే , చిన్న పిల్లలో ఎక్కువ సమయం చదవ వగలిగే సామర్థత తక్కువ ఉంటుంది . మరి ఆ అవసరం కూడా ఎక్కడ ఉండదు . నిరంతరం పిల్లల్ని చదవమని వత్తిడి చేస్తే , అది వారి ప్రేరణ ను, స్కులో కర్యనిర్వహణని తగ్గిస్తుంది అని చాలా పరిశోధనలలో తేలింది .  ఇలా  జరిగే అవకాశం 15 సంవస్సరాల లోపు పిల్లల లో ఎక్కువ గా ఉండొచ్చు .
  2. బలవంతంగా చదివించిడం చదువుకి అవరోధం : పిల్లలు ఏం చదవాలి, ఎలా చదవాలి అనే నిర్ణయాలు తీసుకునే విషయం లో వారికీ స్వేచ్చనిస్తే  , వారు తప్పకుండా మీరు చెప్పాలనుకునేది వింటారు. అదే మీరు బలవంతంగా చదివించే ప్రయత్నాలు చేస్తే  వారు ఎదురు తిరిగే ప్రమాదం ఉంది . వారిని ఆదేశిస్తున్నట్టు కాకుండా సలహాలు ఇస్తున్నట్లు మాట్లాడాలి . ఉదాహరణకి , “ ఈ  రోజు ఏం చదవలనుకుంటున్నవు ?” లేదా , “ నేనేమన్నా సహ యం చేయాలా ?” ఈ రకంగా మాట్లాడితే వారు కూడా ప్రోత్సాహం పొంది చదవడానికి ఇష్టపడుతారు .
  3. క్రమబద్దతను ప్రోత్సహించాలి :పిల్లల దినచర్యలో చదువుకు కొంత బాగం కేటాయిస్తే , వారిని మాటిమాటికి చదువుకోమని చెప్పే అవసరం ఉండదు .  మంచి దినచర్య క్యాలండర్ తాయారు చేయడమ ఒక చక్కని ఉపాయము .  అ క్యాలండర్ ఉపయోగించడం నేర్పితే ,వారి చదువుకి సంబందించిన ముక్యమైన అంశాలు , అసైన్మెంటులు లాంటివి అందులో వచ్చేటట్టు చూసుకుంటూ , అ క్యాలండర్ అనుసరించవచ్చు . వారు రోజు ఇంటికి వచ్చి చదవలిసిన హోంవర్క్ ల చెక్లిస్ట్ ని ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉంటే సమయం కూడా వృధా అవ్వదు . అలాగే భోజన సమయం రోజూ  ఒకే వేళ లో ఉండాలి .  అప్పుడు వారు భోజనం ముందో లేక తరువాతో హోంవర్క్ చేసుకోవడమో , చదువుకోవడమో  ప్లాన్ చేసుకోగలుగుతారు .
  4. చదువుకునే వాతావరణం కలిగించాలి :పిల్లలకి చదువుకోవడానికి తగిన వాతావరణం కలిగించాలి . వారిని చదువుకోమని చెప్పి మనం టీవీ చూడడంలో నిమగ్నమైతే వారు ఏకాగ్రతతో చదవలేరు . టీవీ ,కంప్యూటర్ లాంటివి ఏమైనా వారి చదువు సమయం తరువాతే అని వారికీ విశదికరించాలి .
పర్యవేక్షణ : పిల్లల చదువులలో తల్లిదండ్రుల ప్రమేయం  ఉండాలి . పిల్లలు చదువులో చూపించే సమర్థత మరియు బలిహినతల గురించి తల్లిదండ్రులకు అవగహన ఉండాలి . దానివల్ల  వారి మీద అనవసరంగా రుద్దడం ,ఇతరులతో పోల్చడం తగ్గుతాయి . ఇలా  చెయ్యడం వల్ల  పిల్లలో ఆత్మస్థైర్యం పెరిగి , చదువుకోవడానికి ఉత్సాహం చూపుతారు .

No comments:

Post a Comment